అజిత్ కు 20 ఏళ్ళు

HANUMA HANUMA
 అజిత్ పరిశ్రమలో అడుగుపెట్టి 20 ఏళ్ళయింది. విలక్షణ నటులు, రచయిత గొల్లపూడి మారుతీరావు తనయుడు దివంగత గొల్లపూడి శ్రీనివాసరావు రూపొందించిన ప్రేమ పుస్తకం పేరుతో ఆయన సినిమా రంగం ప్రవేశం చేశారు. తెలుగులో పెద్దగా కలిసిరాకపోవడంతో అజిత్ తమిళంలో కెరీర్ ను ఎంచుకున్నారు. వాలీ, విలన్, ముగవరి, ప్రేమలేఖ, బిల్లా, మంగాత్తా చిత్రాల ద్వారా మంచి గుర్తింపు పొందారు. నటి షాలినిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమార్తె. అజిత్ సినిమా రంగ ప్రవేశం చేసిన 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: